నేను గతంలో నాకు నచ్చిన సిరివెన్నెల పాటలపై నా స్పందనలు కొన్ని “తెరచాటు చందమామ” అనే బ్లాగులో ప్రచురించాను. ఇప్పుడు సిరివెన్నెల పాటలపై స్పందనలు, సిరివెన్నెల గారి గురించిన విశేషాలు ఇత్యాదివన్నీ ఒక ప్రత్యేకమైన బ్లాగులో ఉంటే బావుంటుందనిపించి ఈ “సిరివెన్నెల తరంగాలు” అనే కొత్త బ్లాగుని ప్రారంభించాను. సిరివెన్నెల పాటల పుస్తకాల సంకలనం పేరునే ఈ బ్లాగుకి వాడుకోవడం జరిగింది!