సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 2

సిరివెన్నెల సీతారామశాస్త్రిగారిని కలిసిన నా అనుభవాన్ని వివరిస్తూ సాగుతున్న వ్యాస పరంపరలో ఇది రెండవది. మొదటిది ఇక్కడ ఉంది: సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 1

మొదటి భాగానికి తమ సలహాలూ, ప్రశంసలూ అందించిన అందరికీ thanks. బిజీగా ఉండడం వల్ల ఈ రెండవ భాగం రాయడంలో జాప్యం జరిగింది. విషయపరంగా చూస్తే ఈ భాగంలో Core of Sirivennela’s teaching ఉంది. కాబట్టి ఇది ముఖ్యమైన భాగం. part-3 లో చిన్న చిన్న ఇతర విషయాలు గురించి రాసి ఈ శీర్షిక ముగిస్తాను.

నీ నా నవ్వుల రంగొకటే
జీవితం గురించీ, మనిషితనం గురించీ మాట్లాడ్డం శాస్త్రిగారికి చాలా ఇష్టమైన విషయం –

నువ్వు అంటే నువ్వు కట్టుకున్న టై, బట్టా కాదు. ప్రాణం ఉన్నంత వరకే నీ పేరు పెట్టి పిలుస్తారు. పోయాక body ని “it” అని refer చేస్తారు. అంటే ఆ “it” కంటే వేరైన నువ్వు అని ఏదో ఉండాలి కదా?

అంటూ కంటికి కనిపించే భిన్నత్వం నుంచి, మనసుకే అందే ఏకత్వాన్ని దర్శింపజేస్తారు. మనుషులంతా ఒకటే అని చెబుతూ –

మనమంతా ధాన్యపు పోగులోని ధాన్యపు గింజలం. ఒక గింజ పైన ఉంటుంది ఇంకోటి కింద ఉంటుంది. ఆకారాల్లో తేడాలు ఉంటాయ్. కాని లక్షణం ఒకటే. position and expression లో తేడా ఉన్నా nature ఒకటే.

ఇదంతా చిన్నప్పటి నుండీ చదవుకున్న “మనుషులంతా ఒకటే” భావమే కదా అని మనం అలవాటులోకి, అలసత్వంలోకి జారుకోడానికి ముందే ఈ సత్యంలోని దాగున్న బాధ్యతని గుర్తు చేస్తారు –

ఇటుక పటిష్టంగా ఉంటేనే గోడ బాగుంటుంది. ఇటుక బయటకి వచ్చేసి, గోడ కేసి చూసి, ఇదేమిటి గోడ ఇంత బలహీనంగా, అస్తవ్యస్తంగా ఉందీ అని అడిగితే ఉన్న గోడ కూడా కూలుతుంది. మీలోనే సమస్త ప్రపంచం దాగుంది. ముందు మీరు మారితే ప్రపంచం మారుతున్నట్టే. ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా? తెలిస్తే ప్రతి చోట నిను నువ్వే కలుసుకుని పలకరించుకోవా? అంటే ఇదే.

ఈ నిశిత సూర్య కిరణాలు నా మనసుని తాకుతూ ఉంటే ఒక ఉదయం స్ఫురించింది – “అరే! జిడ్డు క్రిష్ణమూర్తి (ఓ ప్రముఖ తత్త్వవేత్త) చెప్పిన You are the world సారం కూడా ఇదే కదా! సిరివెన్నెల గానీ ఆయన పుస్తకాలు చదివారా?” నా ప్రశ్నకి సమాధానం ఆయన మాటల్లోనే తర్వాత దొరికింది –

ప్రపంచంలో ఏ philosophy పుస్తకమైనా చదవండి. నేను చెప్పిన విషయాలే ఉంటాయ్. అది నా గొప్పతనం కాదు. సార్వజనీనమైన మనిషితనానికి నిదర్శనం అది

సరే! మనమంతా మనుషులం. మనమంతా ఒకటే. మనిషిగా మనకి ఉండాల్సినది ఏమిటి? “ప్రేమ” అంటారు గురువుగారు –

ప్రేమకి ఉన్న శక్తి ఇంక దేనికీ లేదు. ప్రేమతో ఎవరినైనా జయించొచ్చు. గుండెల నిండా ప్రేమ నింపుకోండి. రోజూ ఎదురయ్యే మనుషులందరినీ ప్రేమగా పలకరించండి. ప్రేమతో వ్యవహరించండి. మీ కారుని ఒక బైక్ వాడు రాసుకునిపోతే కోపంతో ఎగిరి వాడి మీద పడడం దేనికి? కారుకి damage ఎలాగా అయ్యింది. శాంతంగా ఉంటే ఒక అనవసర గొడవని అరికట్టచ్చు కదా!.

బాగా చెప్పారు. అంటే దీని అర్థం అన్యాయం జరిగినా ప్రేమతో క్షమించెయ్యాలనా? ఇలాటి అపార్థాలకి తావు ఇవ్వకుండా గురువు గారే ఇలా చెప్పారు –

నేను బస్సులో ఉంటే ఏ అమ్మాయినీ ఎవ్వడూ ఏడిపించలేడు. ముందు నన్ను పడగొట్టమంటాను. అందరిలోనూ నిద్రాణమైన మనిషితనం ఉంటుంది. కాని భయం ఆపుతుంది. ఒక్కడు ముందుకు వచ్చి ఎదిరిస్తే మొత్తం బస్సులోని వారంతా వాడికి మద్దతుగా కలిసి రావడం మనం చూస్తాం. ధైర్యంగా ఉండండి. అసలు మనం దేనికి భయపడాలి? చావు కంటే ఎక్కువ భయపెట్టేది ఏమైనా ఉందా? ఆ చావు నిర్ణయించేది భగవంతుడు. దానికి తిరుగు లేదు, ఎవరూ ఆపనూ లేరు. ఎవడైనా నన్ను చంపాడూ అంటే వాడు తలారి మాత్రమే, నిర్దేశించేది భగవంతుడు.

ఈ మాటల్లో సత్యం ఎంతుందో ఆలోచిస్తే తెలుస్తుంది. చాలా మంది “ఉపేక్ష”ని “క్షమ”గా భ్రమపడుతుంటారు. మన భయం వల్లో, నిర్లక్ష్యం వల్లో వచ్చిన ఉపేక్షని, ప్రేమగా భావించుకుని, “ఆ వాడి ఖర్మకి వాడే పోతాడు” లే అని మనం చెయ్యగలిగీ ఏమీ చెయ్యకుండా ఆత్మవంచన చేసుకుంటాం. తెలుగు మహా భారతంలో ఉద్యోగ పర్వంలో శ్రీ కృష్ణుడు ధ్రుతరాష్ట్రునికి చెప్పే “సారపు ధర్మమున్ విమల సత్యము” అన్న పద్యంలోని సారాంశం ఇదే –


సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే
పారము పొందలేక చెడబారినదైన అవస్థ, దక్షులె
వ్వారలుపేక్ష సేతురది వారల చేటగుగాని ధర్మని
స్థారకమయ్యు సత్యశుభదాయకమయ్యును, దైవముండెడెన్.

సమాజంలో అధర్మం-అసత్యాలచేత, ధర్మము-సత్యం దారుణంగా చెరచబడుతున్నా, దానిని నిరోధించేశక్తి వుండీ ఉపేక్షించినవారికి తమ ఉపేక్షే చేటుగా పరిణమిస్తుంది

నీ ప్రశ్నలు నీవే ఎవ్వరూ బదులివ్వరుగా

సమాధానాలు కావాలంటే ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి అంటారు సిరివెన్నెల –

యువతలో seriousness పెరగాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి. నిజాయితీగా ఉంటున్నానా? నేను మనిషిగా బ్రతుకుతున్నానా? అని ప్రశ్నించుకోండి. అలా చేస్తే మీకు మీరే సత్యాలని తెలుసుకుంటారు. ఆ సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే అవుతుంది. మీలోని అనంతమైన శక్తిని వ్యర్థ ఆలొచనలతో వృథా పరచకండి. శుభకామనలు చేయండి.

ఈ analysis అన్నది కూడా subjective గా చెయ్యడం ఎంతో అవసరం అంటారు –

సమస్య ఏమిటి అని మీరు దాని నుంచి దూరంగా జరిగి analyze చెయ్యడం కాదు. అసలు ఈ సమస్య కి నేను ఎంత వరకూ కారణం? నాలో నేను ఏమి మార్చుకుంటే ఈ సమస్యకి నా వంతు పరిష్కారం ఇస్తాను? ఇలా ప్రశ్నించుకోవాలి.

ఆలోచిస్తే Objective analysis & subjective analysis రెండూ అవసరమే అనిపిస్తుంది. అయితే objective analysis లో కేవలం ఎనాలసిస్ లోనే ఉండిపోతూ inaction లోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఒబామా అమెరికాని ఎలా నడిపించాలి దగ్గరనుండీ ఆవకాయ్-బిర్యానీ సినిమా దాకా మనకి అన్నిటిపైనా అభిప్రాయాలు ఉంటాయ్. మొన్నొక మిత్రుడు – “మన దేశం ఇంకొక 80 ఏళ్ళు అయినా infrastructure పరంగా develop అవుతుంది అని నేను అనుకోను. రాజకీయ నాయకులు వెనకేసుకోడానికి చూస్తున్నారు గాని, వెనకబాటుదనాన్ని పారద్రోలాలని చూడట్లేదు” అంటూ సుధీర్ఘ ఉపన్యాసం ఇచ్చాడు. నేను అంతా విని అన్నాను – “బాగా analyze చేశావ్. నిజమే, మనకి సమర్థ రాజకీయ నాయకత్వం లేదు. సమస్యలు చాలా ఉన్నాయ్. అయితే మనం ఏమి చెయ్యగలం అని ప్రశ్న కూడా వేసుకోవాలి. మన ఓటు హక్కుని మనం సక్రమంగా వాడుతున్నామా? మనం అవినీతి లేకుండా ఉంటున్నామా? … ఇలా subjective analysis గురించి నేను మాట్లాడేసరికి నా మిత్రుడు ఇక మాట్లాడలేదు!!.

subjective analysis మనని action oriented గా చేస్తుంది. సిరివెన్నెల స్పష్టంగా చెప్పారు –

ఊరికే ఆలోచన కాదు. practical గా ఏమైనా చెయ్యాలి. అదే నేను మీనుంచి కోరుకునేది.

ఈ విషయాన్ని ఆయన అంత నొక్కి వక్కాణించకపోయినా, సుస్పష్టంగా చెప్పారు. సిరివెన్నెల శిష్యులు అనిపించుకోవాలి అనుకునే వారంతా ఇది గుర్తు పెట్టుకుని action oriented గా మారడం కొంతైనా అవసరం. మేనేజ్మెంట్ గురు Peter Drucker కూడా ఈ విషయమే చెప్తారు –

After gaining new knowledge, ask 2 questions –
1. What will I do different with this knowledge?
2. What will I stop doing?

బతుకులో అడుగడుగూ ఒక భేతాళ ప్రశ్ననీ, సమాధానం చెప్తే కానీ ముందుకు సాగలేమంటారు సిరివెన్నెల –

జీవితం అంటే సాఫీగా సాగిపోయే ప్రయాణం కాదు. ఒడిదుడుకులుంటాయ్. solve చేసుకుంటూ ముందుకి సాగడమే. మనకి అల్లాదీన్ అద్భుత దీపం ఏమీ అవసరం లేదు. మీరు అల్లాదీన్ కథ విని ఉంటే ఆ కథలో అల్లాదీన్ రెండు సార్లే జీనీని పిలిచాడు. అదీ సహాయం అవసరమై. అంతే కానీ నా బదులు నువ్వు నిద్రపో, నాకు ఆకలి వేస్తే నువ్వు భోంచెయ్ అనలేదు

ఆయన ఈ మాటల నుంచి 2 inferences చెయ్యొచ్చు –

 1. జీవితంలో problems ఉండకపోవడం default condition అనుకుంటాం మనం. ఇలా అనుకోవడం వల్లే సమస్యలని కష్టాలు గానో, unfortunate things గానో చూస్తాం. అదే problems ని జీవితంలో భాగంగా, default condition గా భావించి చూడండి. అప్పుడు సమస్యలు ఏవో పెద్ద అడ్డంకులుగా అనిపించవ్. చాలా positive attitude వస్తుంది.
 2. సమాధానం చాలా సార్లు మనకి తెలుసు. కాని ఆ సమాధానం అంటే మనకి భయమో, నిర్లక్ష్యమో, బద్ధకమో ఇలా ఏదో feeling/resistance ఉంటుంది. ఆ feeling ని దాటుకుని మనం వెళ్ళలేకపోతాం. కనీసం ఆ feeling ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యకుండా ఎటో పరుగులు తీస్తూ ఉంటాం. కొత్త సమాధానల కోసం వెదుకులాటలో మనకి తెలిసిన సమాధానంతో జరగాల్సిన కార్యసాధన మరుగునపడిపోతుంది. అంటే మన mind execution కంటే collection of information మాత్రమే చెయ్యడానికే ఇష్టపడుతుంది . దీనిని “information trap” అనవచ్చు. దీనిని దాటుకుని వెళ్ళడం చాలా ముఖ్యమని సిరివెన్నెల సందేశం.

ఈ information trap కి సంబంధించిన ఒక చిన్న కథ చెప్పి ఈ part-2 ముగిస్తాను. జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన joke ఇది:

A devil and a friend of his were walking down the street, when they saw ahead of them a man stoop down and pick up something from the ground, look at it, and put it away in his pocket.
The friend said to the devil, “What did that man pick up?”
“He picked up a piece of Truth,” said the devil.
“That is a very bad business for you, then,” said his friend.
“Oh, not at all,” the devil replied, “I am going to let him organize it.

ఇలా కథలో వ్యక్తిలా truth కనుగొన్నప్పటికీ, దానిని execute చెయ్యకుండా organization అనే information trap లో పడిపోవడం మీ స్వానుభవం లో కనీసం ఒకసారైనా చూసుంటారు. కాదంటారా?

(To be continued in part 3)

సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 2

15 thoughts on “సిరివెన్నెలతో ఓ సాయంత్రం – 2

 1. really EXCELLENT, అబ్బా ఎంత అదృష్టవంతులండి మీరు, అసలు ఆయినది మామూలు జనం కాదు, ప్రతీ పాట ఓ అధ్బుతం, అసలు మీకు గురువు గారిని కలిసే చాంస్ ఎలా వచ్చింది, చెప్పగలరు, జీవితం, తత్వం, సరదా, ప్రేమా, భాదా ఏ కోణం లో అయినా సిరివెన్నెల గారు బ్రాండె వేరు, ఆహా ఎంత అదృష్టం చేసుకున్నారు మీరు, నేనిప్పుడే మీ మొదట పోస్టు కూడా చూశాను, నేను సిరి వెన్నెల గారి అభిమానిని, మీకు కలిసే భాగ్యం ఎలా లభించిందో నేను తెలుసుకోవచ్చా ?

  Like

 2. >>>> అబ్బా ఇది కేకండి >>>>

  బతుకులో అడుగడుగూ ఒక భేతాళ ప్రశ్ననీ, సమాధానం చెప్తే కానీ ముందుకు సాగలేమంటారు సిరివెన్నెల –

  >>>> అసలు ఎలా చెప్పరండి అద్భుతం,

  Like

 3. Madhu says:

  Thanks for sharing such a valuable information…
  ‘Aadhi Bhikshuvu vadi nedhi koredhi’ ani chiru kopam pradharsinchinaaa aa ‘Aadhi Bhikshuvu’ ku mana Sasthri gare athyantha priyasishyulalle undhi kadhandi.

  -Madhu

  Like

 4. సిరివెన్నెలని కలుసుకోవడం ఎలా?

  అశ్విన్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఇది రాస్తున్నాను. సిరివెన్నెల గారు very accessible. పాటలు రాయడం మధ్యలో తీరిక దొరికినప్పుడు ఎవరితోనైనా మాట్లాడతారు. ముందు appointment తీసుకుంటే మంచిది. శ్రీను అనే secretary ఈ appointments అవీ చూస్తారు. ఆయనకి phone చేసి మనం అడగొచ్చు.

  నాకు mail చేస్తే మరిన్ని details ఇవ్వగలుగుతాను.

  Like

 5. ఫణీంద్ర గారూ..
  చాలా అద్భుతంగా చెప్పారు. మీరు రాసిన ప్రతీ పదంలో సిరివెన్నెల గారు దర్శనమిచ్చారు. ఆయన అమృతపు పలుకుల్ని చెవులారా విన్నంత భావాన్ని కలిగించారు. మీకు ఎన్ని ధన్యవాదాలయినా తక్కువేనండీ….!

  Like

 6. Mauli says:

  సమస్య ఏమిటి అని మీరు దాని నుంచి దూరంగా జరిగి analyze చెయ్యడం కాదు. అసలు ఈ సమస్య కి నేను ఎంత వరకూ కారణం? నాలో నేను ఏమి మార్చుకుంటే ఈ సమస్యకి నా వంతు పరిష్కారం ఇస్తాను? ఇలా ప్రశ్నించుకోవాలి.

  ———————————————————————

  ఇక్కడ నాకొక సందేహం

  నేను సమస్స్య ఉంది అని తెలుసుకొన్నాను ……నేను యే మాత్రం కారణం కాదు.

  అప్పుదు నేను పరిష్కారం చెయుటకు/తెలియ పరచుటకు ప్రయత్నించుట అనవసరము లేదా ప్రమదకరము అవుతుందా?

  Like

  1. Phani says:

   Hi,

   Here are a series of questions to understand Sirivennela’s message better –

   1. Do I see an issue?

   If you don’t see the issue, the issue doesn’t exist as far as you are concerned. Nothing to do here.

   2. Do I care about the issue?

   Even if you see the issue, if you don’t care, then you would not bother about the issue. No problem here too.

   But if you care, then the right question to ask is –

   What can I do to help solving the issue?

   If you ask the above question, you start to act. Otherwise you keep on analyzing the issue with out doing anything. This is what Sirivennela wanted youth to avoid.

   Like

 7. Mauli says:

  యువతలో seriousness పెరగాలి. ప్రశ్నించడం నేర్చుకోవాలి. నిజాయితీగా ఉంటున్నానా? నేను మనిషిగా బ్రతుకుతున్నానా? అని ప్రశ్నించుకోండి. అలా చేస్తే మీకు మీరే సత్యాలని తెలుసుకుంటారు. ఆ సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే అవుతుంది. మీలోని అనంతమైన శక్తిని వ్యర్థ ఆలొచనలతో వృథా పరచకండి. శుభకామనలు చేయండి.

  ——————————————————————————–

  right…but i can not blame only Yuvatha, “they can not understand what they do not know as guruji said ” …their parents should help them and watch them if required ….

  Like

  1. Phani says:

   You are right! aa rOju gathering lo andaruu 30 years lOpu vaaLLE unnaaru. so mammalni address chEstuu annaaru kaabaTTi “yuvatalO” ani vaaDaru. But the message applies to all.

   Like

 8. Mauli says:

  I knew i was in ‘information trap’ in large…but am totallly surprised to learn even little also many have same habbits….so my count down starts now …to come out of it 🙂

  Like

 9. Mauli says:

  అల్లాదీన్ రెండు సార్లే జీనీని పిలిచాడు

  ——————————————————–

  very inspirative …so one should not look for helping hand always …should try to do on own and face the challenges right!!!

  Like

 10. Dear Friends, Happy April Fool’s Day!!

  A young man hired by a supermarket reported for his first day of work. The manager greeted him with a warm handshake and a smile, gave him a broom and said, “Your first job will be to sweep out the store.”
  “But I’m a college graduate,” the young man replied indignantly.
  “Oh, I’m sorry. I didn’t know that,” said the manager. “Here, give me the broom – I’ll show you how.”

  Happy April Fool’s Day!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s